• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎస్‌పి సస్పెన్షన్‌- కలెక్టర్‌ బదిలీ

By Staff
|

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై హత్యాయత్నం సంఘటనకు సంబంధించి చిత్తూరు పోలీసు సూపరింటిండెంట్‌ నవీన్‌ చంద్‌పై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. కలెక్టర్‌ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈవిషయాన్ని హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ ప్రకటించారు. డిఐజిని బదిలీ చేయాలని, బాంబు డిస్పోజల్‌ బాధ్యతలు నిర్వహించాల్సిన రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొందరు సీనియర్‌ పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించారు. ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి మార్గదర్శక సూత్రాలు పాటించలేదన్న ఆరోపణలపై చిత్తూరు జిల్లా ఎస్పీ నవీన్‌ చంద్‌, మరికొందరు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ లో జామర్లు లేకపోవడం, ముఖ్యమంత్రి కారు నెంబరును పోలిన వాహనాలను ఎక్కువ సంఖ్యలో ఉండకపోవడం, సిఎం ప్రయాణానికి ముందు తిరుమల ఘాట్‌ రోడ్డులో రోడ్‌ షోను మొక్కుబడిగా నిర్వహించడం భద్రతా ఏర్పాట్లలో ప్రధాన లోపాలని ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలో ఉన్నప్పుడు ఈ ఏర్పాట్లను సమీక్షించవలసిన బాధ్యత జిల్లా ఎస్పీలపై ఉంటుంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నరిటైర్డు ఐపిఎస్‌ అధికారి ప్రాధమిక నివేదికను హోంమంత్రి దేవేందర్‌ గౌడ్‌ కు సమర్పించినట్టు తెలుస్తోంది. భద్రతా వైఫల్యం లేదని, క్లెమోర్‌ మైన్స్‌ ను ఎదుర్కోగల అత్యాధునిక టెక్నాలజీనిసమకూర్చుకోవలసి ఉందని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X