వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
17 మంది మిలిటెంట్ల కాల్చివేత
న్యూఢిల్లీ: చొరుబాట్లను అడ్డుకోవడంలో భాగంగా నియంత్రణ రేఖ వెంబడి జమ్మూ కాశ్మీర్‌లో భారత భద్రతా బలగాలు 17 మందిమిలిటెంట్లను హతమార్చాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు వివిధ ప్రాంతాల్లో జరిగిన సంఘటనల్లో 17 మందిమిలిటెంట్లు మరణించారు.
నలుగురేసిమిలిటెట్లు పూంచ్, బారాముల్లాల్లో, ముగ్గురుకుప్వారాలో, ఇద్దరు ఉధంపూర్‌లో హతమైనట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. భారీ ఆయుధాలను, మందుగుండు సామగ్రినిస్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పాకిస్థానీ జాతీయులైన ఈమిలిటెంట్లు జైష్- ఎ- మహ్మద్, లష్కర్- ఎ- తోయిబా, హర్కత్- ఉల్-జిహాదీ ఇస్లామీ, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన వారని ఆయన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!