వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షేక్ హ్యాండ్ వద్దు, బాబుకు సూచన
హైదరాబాద్: సోమవారం నుంచి విధులకు తిరిగి హాజరుకావడం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరో వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కోడెల శివప్రసాదరావు తెలిపారు. అయితే, ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని, విధులకు ఇంటి నుంచే హాజరవుతున్నారని చెప్పారు. అలాగే సర్జరీ కూడా అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
మరోవైపు, తనను పరామర్శించేందుకు వస్తోన్న వారితో చంద్రబాబుషేక్ హ్యాండ్ ఇవ్వడం మంచిది కాదని వైద్యులు తెలిపారు. కాలర్ బోన్ ప్రాక్చర్అయిన సీఎం మాటీమాటీకి చేతులు కలపడం మంచిది కాదని నిమ్స్ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఆయన కాలర్ ప్రాంతంపై మరింతగా భారం పడుతుందని,సీఎంకు ఈ విషయం తెలియచేశామన్నారు.
Comments
Story first published: Monday, October 6, 2003, 23:53 [IST]