• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు

By Staff
|

హైదరాబాద్‌: అలిపిరి ఘటన నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖలో భారీ మార్పులు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలీసు వ్యవస్థలోని లోపాలను సవరించి, సమగ్రంగా మార్పులకుశ్రీకారం చుట్టునున్నామని ఆయన సోమవారం తన నివాసంలో హోంశాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం తెలిపారు.

ఒక సంఘటనను ఫాలో అప్‌ చేయడం, దాన్ని ఎప్పటికప్పుడు రీపోర్ట్‌ చేయడం, ప్రతిఅంశాన్ని నోట్‌ చేసుకొని తెలియచేయడం వంటి మౌళికఅంశాల్లోనే లోపాలు కన్పిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. హోంశాఖ మంత్రి దేవేందర్‌ గౌడ్‌, డిజీపి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమూల మార్పులను వచ్చే కొద్ది రోజుల్లో అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X