• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీకాకుళం జిల్లాకు వరద తాకిడి

By Staff
|

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంశ్రీకాకుళం జిల్లాపై పడింది. ఈ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వంశధార, నాగావళి నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కట్టబొమ్మాళి, సోంపేట, ఇచ్చాపురం, కవిటి మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం మధ్యాహ్నానికి కళింగపట్నానికి వంద కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలోపెనుగాలులుతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులువీచే సూచనలున్నాయి. తెలంగాణ జిల్లాల్లో చెదురుమొదురు వర్షాలు పడే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X