నేనే వస్తాను..మీరు రావొద్దు: బాబు
హైదరాబాద్: తనను చూసేందుకు వస్తోన్న ప్రజలు అంత శ్రమ తీసుకోవద్దని, తనే వారిని చూసేందుకు త్వరలో వస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నేనే వస్తాను..మీరు రావొద్దని ప్రజలకువిజ్ఞప్తి చేశారు. తీవ్రవాదుల చర్యలకు భయపడి తాను హైదరాబాద్ ఆఫీసుల్లోనే ఉండిపోనని, ఎప్పటిమాదిరిగానే ప్రజలను తనేస్వయంగా కలుస్తానని ఆయన స్పష్టం చేశారు.
భద్రతలో మార్పులుంటాయని కానీ ప్రజల వద్దకు వెళ్ళే తన పద్దతిలో మార్పు ఉండదని ఆయన చెప్పారు. శనివారం ముఖ్యమంత్రిని కలిసినప్రముఖుల్లో లక్ష్మీపార్వతి ఉన్నారు. చంద్రబాబుఅంటే గిట్టని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధినేత్రి లక్ష్మిపార్వతిముఖ్యమంత్రిని పరామర్శించడంవిశేషం.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానాచార్యులు, ప్రముఖ సినిమా గాయనీ సుశీల కూడా ముఖ్యమంత్రిని శనివారం కలుసుకొని పరామర్శించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!