• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబూమోహన్‌కు పుత్రవియోగం

By Staff
|

హైదరాబాద్‌: ప్రముఖ హాస్యనటుడు, కార్మిక శాఖ మంత్రి బాబూమోహన్‌పెద్ద కుమారుడు పవన్‌కుమార్‌ ఆదివారం హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కుమారుడిమరణంతో బాబూమోహన్‌ దుఃఖసాగరంలో మునిగిపోయారు.

ఇంజనీరింగ్‌ చదువుతున్న పవన్‌కుమార్‌ బేగంపేటలోని తమ నివాసం నుంచి జూబిలీహిల్స్‌కు మోటార్‌సైకిల్‌పై బయలుదేరాడు. మోటార్‌సైకిల్‌ రోడ్‌ డివైడర్‌కు ఢీకొట్టి పడిపోవడంతో ప్రమాదం సంభవించింది. వెనుకే కారులో వస్తున్న సోదరుడు ఉదయ్‌కుమార్‌ పవన్‌కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు.అప్పటికే పవన్‌కుమార్‌ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. తలకు బలమైన గాయం కావడంతో పవన్‌కుమార్‌ మరణించాడు. మంత్రులు టి. దేవేందర్‌ గౌడ్‌, బి.వి. మోహన్‌ రెడ్డి,విజయరామారావు, తదితర ప్రముఖులు బాబూమోహన్‌ను పరామర్శించి, ఓదార్చే ప్రయత్నం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X