• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దోపిడీదొంగ కాల్చివేత

By Staff
|

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా రామచంద్రాపురం సమీపంలో ఒక దోపిడీ దొంగను పోలీసులు కాల్చి చంపారు. మరో ఇద్దరు పారిపోయినట్లు పోలీసులు చెప్పారు.

పోలీసుల కథనం ప్రకారం- శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో దయాళ్‌ అనే వ్యాపారి ఇంటిలో దొంగతనం జరిగింది. దయాళ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దోపిడి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ముగ్గురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో సంచరిస్తుండడం గమనించారు. వారిని సమీపించి పట్టుకోబోతుండగా ఒక దొంగ కత్తి తీసి కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్‌ గాయపడ్డాడు.మిగతా ఇద్దరు కూడా పోలీసులపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక దొంగ మరణించాడు. మరో ఇద్దరు పారిపోయారు.

దయాళ్‌ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి ఇంటికి తాళం వేసి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి వున్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దోపిడి దొంగలు తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించి ఆరు లక్షల రూపాయలవిలువ చేసే నగలు, నగదు ఎత్తుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద నుంచి కొంత సొమ్మును, నగలను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X