వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి డిశ్చార్జి
చెన్నై: నిషిద్ధపీపుల్స్వార్ దాడిలో గాయపడి ఆస్పత్రిలో చేరిన శాసనసభ్యుడు చదలవాడ కృష్ణమూర్తి బుధవారం డిశ్చార్జి అయ్యారు. రెండు వారాల పాటు చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందిన కృష్ణమూర్తి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు చెప్పారు.
డిశ్చార్జి అయిన సందర్భంగా ఆయనను అభినందించడానికి ఆయన అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలుపెద్దయెత్తున వచ్చారు. కృష్ణమూర్తి డిశ్చార్జి అనంతరం వారితో కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. నక్సల్స్ దాడి సంఘటన తన నియోజకవర్గంలో జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తనకు ఇది పునర్జన్మ వంటిదని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, October 15, 2003, 23:53 [IST]