వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెడికల్‌ అడ్మిషన్లలో అక్రమాలు: కోడెల

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో మెడికల్‌, డెంటల్‌ కాలేజీల అడ్మిషన్లలో అక్రమాలు జరిగినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుఅంగీకరించారు. మెడికల్‌, డెంటల్‌ కాలేజీల అడ్మిషన్లపై ఆయన గురువారంశ్వేతపత్రం విడుదల చేశారు.

అడ్మిషన్లలో అక్రమాలకు పాల్పడినవారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆరోగ్యవిశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌, రిజిస్ట్రార్‌లపైనే కాకుండా అక్రమాలకు పాల్పడిన ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మెడికల్‌కోర్సులో 52 సీట్లు, డెంటల్‌ కోర్సులో 48 సీట్లు అక్రమంగా భర్తీ చేసినట్లు తేలిందని ఆయన చెప్పారు. ఈసీట్ల భర్తీకి నాలుగు వారాల గడువు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టును కోరుతామని ఆయన చెప్పారు. అక్రమసీట్ల భర్తీని గుర్తించవద్దని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను కోరుతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X