వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉత్తర కోస్తాపై అల్పపీడన ప్రభావం
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారడంతో ఉత్తర కోస్తాలోవిస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు ఉత్తర కోస్తాలో దీని ప్రభావం వుంటుందని వాతావరణపరిశోధన కార్యాలయం అధికారులు చెబుతున్నారు.
అల్పపీడన ప్రభావం వల్ల ఈశాన్య ప్రాంతం నుంచి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులువీస్తాయని వారంటున్నారు. విశాఖపట్నం అంతటా భారీగా వర్షాలుకురిశాయి. అల్పపీడన ప్రభావం వల్ల కోస్తాలోనూ,రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!