వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరెస్టులతో సంకల్ప్‌ ప్రశాంతం

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: విశ్వ హిందూ పరిషత్‌ (విహెచ్‌పి) అయోధ్యలో తలపెట్టిన సంకల్ప సభను ప్రభుత్వంవిఫలం చేసింది. విహెచ్‌పి నాయకులు అశోక్‌ సింఘాల్‌ను, రామ్‌విలాస్‌ వేదాంతిని, వందలాది కార్యకర్తలను పోలీసులుఅరెస్టు చేశారు.

సంకల్ప సభకు సమయానికి ముందే కరసేవక్‌పురం వెలవెలబోయింది. అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడేఅరెస్టులు చేయడంతో సభాస్థలికి చేరుకోలేకపోయారు. వివిధ మార్గాల గుండా అక్కడికి చేరుకోవడానికి విహెచ్‌పి కార్యకర్తలు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.

వివాదాస్పద స్థలంలోని రాముడి విగ్రహాన్ని దర్శించుకునే వరకు కదలబోనని సింఘాల్‌ కరసేవక్‌పురంలోని కేంద్ర కార్యాలయంలో మొండికేశారు. వేదాంతిని పోలీసు వ్యాన్‌లోఫైజాబాద్‌ అవతలికి తరలించారు. తాము నాలుగు వేల మంది కరసేవకులనుఅరెస్టు చేశామని పోలీసులు చెబుతుండగా అరెస్టులు మరింత ఎక్కువగా ఉంటాయని విహెచ్‌పి నాయకులంటున్నారు.

విహెచ్‌పి సంకల్ప్‌ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసినందునఅరెస్టయిన రామభక్తులందర్నీ వదిలేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఖండ్‌ ప్రతాప్‌ సింఘ్‌విలేకరులకు చెప్పారు. విహెచ్‌పి నేతలు అశోక్‌ సింఘాల్‌ను, రామ్‌విలాస్‌ వేదాంతిని అరెస్టు చేసినట్లు ఆయన అంగీకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X