శిశువు తారుమారు- దర్యాప్తు మొదలు
హైదరాబాద్: సుల్లాన్‌పూర్ ప్రసూతి వైద్య కేంద్రంలో శిశు మార్పిడికేసుపై దర్యాప్తు సోమవారం ప్రారంభమైంది. నల్లగొండ జిల్లా సల్వేర్ నారాయణపురం గ్రామానికి చెందని సాయిలు భార్య కె.పద్మ తనకు మగబిడ్డ పుడితే ఆస్పత్రి సిబ్బంది ఆడబిడ్డనుఅందజేశారని ఆరోపిస్తూ ఆదివారం ఫిర్యాదు చేసింది.
జన్యు పరీక్షల నిమిత్తం పద్మ దంపతుల రక్తం నమూనాలను సేకరించారు. రక్తం నమూనాలను ఇవ్వడానికి ముందు పద్మ నిరాకరించింది. అయితే నచ్చజెప్పడంతో అందుకు అంగీకరించింది. పద్మ తన శిశువు కాదంటున్న ఆడబిడ్డ నీలోఫర్ ఆస్పత్రిలో ఉంది. ఈ శిశువు నుంచి మంగళవారం రక్తం నమూనాలను తీసుకుంటారు. ఫోరెన్సిక్ లాబొరేటరీ ఫలితాలు వచ్చిన తర్వాతనే ఈ కేసు వివరాలు తేలుతాయని అంటున్నారు. అయితే పద్మ ఆరోపణను ఆస్పత్రి డ్యూటీ డాక్టర్ సంధ్యారాణి ఖండించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!