• search

కివీస్‌తో భారత్‌ సిరీస్‌ డ్రా

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    మొహాలి: భారత్‌తో జరిగిన రెండు రెండు టెస్టు మ్యాచ్‌ల క్రికెట్‌ సిరీస్‌ను న్యూజిలాండ్‌ డ్రా చేయగలిగింది. ఒక రకంగా ఇది న్యూజిలాండ్‌కు నైతికవిజయం. న్యూజిలాండ్‌ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చేసిన భారీ స్కోరుతో భారత్‌ ఫాలో ఆన్‌ను తప్పించుకోలేకపోయింది.

    ఆదివారంనాడు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోపయి 390 పరుగులు చేసిన భారత్‌ శనివారం ఉదయం మరో 34 పరుగులు మాత్రమే జోడించగలిగింది. 424 పరుగులకు మొదటి ఇన్నింగ్స్‌లో ఆలవుట్‌అయింది. హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ వి.వి.యస్‌. లక్ష్మణ్‌ 104 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు.

    ఫాలో ఆన్‌కు దిగిన భారత్‌ బ్యాట్స్‌మెన్‌ టఫీ బౌలింగ్‌ ముందు నిలదొక్కుకోలేకపోయారు. ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా సమయోచితంగా ఆడి 52 పరుగులు చేశాడు. సెహ్వాగ్‌ ఒక పరుగుకే పెవిలియన్‌ దారి పట్టాడు. రాహుల్‌ ద్రావిడ్‌ ఐదు పరుగులకు, సచిన్‌ టెండూల్కర్‌ ఐదు పరుగులకు అవుట్‌ కాగా లక్ష్మణ్‌ భారత్‌ను ఆదుకున్నాడు. ఒక రకంగా లక్ష్మణ్‌ ఓటమి నుంచి భారత్‌ను బయట పడేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 104 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలి లక్ష్మణ్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆట ముగిసే సమయానికి 67 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. ఆట ముగిసే సమయానికి భారత్‌ నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.

    టఫీ మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీంతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. తొలి టెస్టులోనూ, రెండో టెస్టులోనూ తన ప్రతిభను కనబరిచిన వి.వి.యస్‌. లక్ష్మణ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికయ్యారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more