• search

ఎన్నికల ఊసు లేదు : టిడిపి

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్‌: పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశంలో ముందస్తు ఎన్నికలపై చర్చించలేదని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై నక్సల్స్‌ దాడి చేసిన 20 రోజుల తర్వాత తెలుగుదేశం పోలిట్‌ బ్యూరో, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం జరిగాయి. సమావేశాల అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువిలేకరులతో మాట్లాడారు.

    ముందుస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం గురించి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుపై విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు. గడువు కన్నా ముందే ఎన్నికలు నిర్వహించే విషయమై సమావేశాల్లో నాయకులెవరూ ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిపై నక్సల్స్‌ చేసిన దాడిని సమావేశంలో ఖండించినట్లు ఆయన తెలిపారు. హింసకు స్వస్తి చెప్పి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా తెలుగుదేశం నక్సల్స్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. కరువు, కోటి వరాల లబ్ధిదారుల ఎంపికలపై సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రికి ఇది పునర్జన్మ అని, ప్రజాసేవకు పార్టీ నాయకులందరూ పునరంకితం కావాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు పోలిట్‌ బ్యూరో సమావేశంలో ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదించారు.

    మొరాయించిన పార్టీ పతాక

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాదాపు ఇరవై రోజుల తర్వాత సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి ముఖ్యనాయకులతో సమావేశం జరిపారు. అంతకు ముందు ఆయన ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ఆవరణలో తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తుండగా రెండు సార్లు జెండా కింద పడిపోయింది. దీనిని అపశకునంగా భావించిన చంద్రబాబు నాయుడు, ఇతర నాయకులు సీరియస్‌ గా అలాచూస్తుండిపోయారు.

    అంతకు ముందు చంద్రబాబు నాయుడికి గుమ్మడి కాయలతో దిష్టి తీసి తెలుగు మహిళలు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. పతాకావిష్కరణ తర్వాత ముఖ్యమంత్రి వందలాది కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే ప్రయత్నం చేశారు. అయితే మైక్‌ పని చేయకపోవడంతో ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకుని లోనికి వెళ్లారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more