గుంటూరు జిల్లాలో ఇద్దరు నక్సల్స్‌ హతం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభా ఎన్నికలకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని,అందుకు పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని బీజేపీ పిలుపునిచ్చింది. హైదరాబాద్‌ శివారులలో బీజేపీ నిర్వహిస్తోన్న చింతక్‌ బైఠక్‌ ముగిసిన సందర్భంగా ఆపార్టీ రాష్ట్రశాఖ ఉపాధ్యాక్షుడు వి.శేషగిరిరావు విలేకరులతో మాట్లాడుతూ..ముందస్తు ఎన్నికలకు తెలుగుదేశం మొగ్గుచూపుతోందని ఆయన తెలిపారు.

నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంపైనే ఈ సమాలోచనల్లో చర్చించారని తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై దాడి అనంతరం సానుభూతి వెల్లువెత్తుతోంది. దీన్ని టీడీపీ వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

డిసెంబర్‌ 15 నుంచి యువ ఓటర్ల సమ్మేళనం, నవంబర్‌ లో భూమికోసం, నీటికోసం వంటి కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. 100 నియోజకవర్గాల్లో పార్టీ పనితీరును సమీక్షస్తామని ఆయన చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X