చంద్రబాబు రాజీనామాకు వైస్‌ డిమాండ్‌

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 27-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌ః మద్యం కొనుగోళ్ళలో అక్రమాలు జరిగాయని హైకోర్టు నిర్ధారించినందునముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు.

గత మూడేళ్ళలో అంధ్రప్రదేశ్‌ బివరేజెస్‌ కార్పొరేషన్‌ కొన్ని సంస్ధల నుంచి అధిక ధరకు మద్యాన్ని కొనుగోలు చేయడం వల్ల ప్రజలపై దాదాపు ఆరువందల కోట్ల రూపాయల భారం పడిందని, ఈ మొత్తం తెలుగుదేశం నాయకుల జేబుల్లోకి పోయిందని వైఎస్‌ సోమవారం ఇక్కడవిలేకరుల సమావేశంలో ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అవినీతి కారణంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ధరలు అధికంగా ఉన్నాయని రాజశేఖరెడ్డి అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X