జమ్మూలో ఇద్దరు ఆర్మీ జవాన్ల బలి

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 28-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

జమ్ము: జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా ఖిలానిలోమిలిటెంట్లు మంగళవారం అత్యధునాతన పేలుడు పదార్థాలతో ఇద్దరు ఆర్మీ జవాన్లను బలి తీసుకున్నారు. ఈ దాడిలో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఉదయం పదకొండున్నర, మధ్యాహ్నం 12 గంటల మధ్య రోడ్డుపై వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పైమిలిటెంట్లు రిమోట్‌ కంట్రోల్‌తో పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడి తీవ్రతకు ఒక వాహనం తలకిందులుగా ఎగిరిపడింది. దీంతో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.మిలిటెంట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

శ్రీనగర్‌లోని భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బియస్‌ఎన్‌ఎల్‌) కేంద్ర కార్యాలయంపైమిలిటెంట్లు మంగళవారం గ్రెనేడ్‌ విసిరారు. ఈ సంఘటనలో పది మంది దాకా గాయపడ్డారు. గాయపడినవారిలో మహిళలు కూడా ఉన్నారు. పేలుడు సంభవించినప్పుడు కౌంటర్ల వద్దపెద్ద యెత్తున ప్రజలున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X