• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టెన్నిస్‌:సెమీ ఫైనల్‌లో సానియా మీర్జా

By Staff
|

Posted on 28-10-03

హైదరాబాద్‌: ఆఫ్రో ఆసియన్‌ క్రీడల టెన్నిస్‌ మహిళా విభాగంలో హైదరాబాద్‌కు చెందిన సానియామీర్జా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. భారత్‌ టెన్నిస్‌ క్రీడాకారులు నలుగురుసెమీ ఫైనల్‌కు చేరుకున్నారు.

వ్యక్తిగత సింగిల్స్‌ మ్యాచ్‌లో సానియా జింబాబ్వేకు చెందిన ఫద్జాయి మర్విసైర్‌పైవిజయం సాధించింది. మరో మ్యాచ్‌లో భారత్‌కు చెందిన రష్మీ చక్రవర్తిసెనెగల్‌కు చెందినఖదీ బెర్తెపనై 6-3, 7-6 స్కోర్‌తోవిజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. పురుషుల విభాగంలో భారత్‌కు చెందినవిజయ్‌ కన్నన్‌ శ్రీలంకకు చెందిన గొడమన్‌ను 6-1, 7-5 స్కోరుతో ఓడించిసైమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. భారత్‌కు చెందిన ప్రకాశ్‌ అమృతరాజ్‌ ఇప్పటికేసెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు.

ఆఫ్రో ఆసియన్‌ క్రీడల్లో మంగళవారం భారత్‌కు నాలుగు రజత పతకాలు దక్కాయి. 25మీటర్ల షూటింగ్‌ స్టాండర్డ్‌ విభాగంలో భారత్‌కు చెందిన జస్పాల్‌ రాణా రజత పతకం సాధించాడు.అంజలి భగవత్‌కు కూడా రజత పతకం దక్కింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X