పథకాల అమలుకు కాంగ్రెస్‌ కాపు

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 28-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: ప్రజలకు ప్రభుత్వం ప్రకటించిన వరాలు దుర్వినియోగం కాకుండా తమ పార్టీ కార్యకర్తలు పర్యవేక్షిస్తారని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ చెప్పారు. పార్టీ తలపెట్టిన బస్సు యాత్రపై చర్చించేందుకు మంగళవారం జరిగిన సమావేశం అనంతరం ఆయనవిలేకరులతో మాట్లాడారు.

అనర్హులైనవారికి సంక్షేమ కార్యక్రమాల్లో భాగం కల్పిస్తే సహించబోమని, కోటి వరాలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికే ఉపయోగపడుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం పథకాలు అర్హులైన ప్రజలకు చేరాలనేది తమ ఉద్దేశ్యమని ఆయన అన్నారు. కోటి వరాల అమలులో జరుగుతున్న అవకతవకలను అడ్డుకోవాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. ప్రభుత్వం హడావిడిగా పథకాలు ప్రకటిస్తోందని, ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం వరాలు కురిపిస్తూ ఉండవచ్చునని, అయితే ఈ కార్యక్రమాలు అర్హులకు చేరాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి