దళితులకు, రైతులకు కరెంట్‌ వరాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 28-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: విద్యుత్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, దళితులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో మంగళవారం సమావేశమైన మంత్రి వర్గం ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలనువిద్యుచ్ఛక్తి శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడువిలేకరులకు చెప్పారు.

ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో పేరుకుపోయినవిద్యుత్‌ బాకీలను మాఫీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దళితులు 170 కోట్ల రూపాయల మేరకు లబ్ధి పొందుతారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఎపిట్రాన్స్‌కోకు చెల్లిస్తుందని మంత్రి చెప్పారు. తత్కాల్‌స్కీమ్‌లో రైతులకు రాయితీ కల్పించినట్లు ఆయన తెలిపారు. తత్కాల్‌స్కీమ్‌ కింద వ్యవసాయ బావులకు తీసుకునే కరెంట్‌ కనెక్షన్‌కు చెల్లించే మొత్తాన్ని రెండు వేల రూపాయల నుంచి వేయి రూపాయలకు తగ్గించినట్లు ఆయన చెప్పారు. వ్యవసాయ కనెక్షన్లకు యూనిట్‌ చార్జీని రూపాయి నుంచి 50పైసలు తగ్గించినట్లు ఆయన తెలిపారు.

రెగ్యులేటరీ కమిషన్‌ అనుమతి లభించగానే ఈ నిర్ణయాలు అమలులోకి వస్తాయని ఆయన చెప్పారు.విద్యుత్‌ చట్టంలో రైతులకు, పేదలకు నష్టం కలిగించే నిబంధనలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కూడా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X