మరిన్ని వరాలు కురిపించిన బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 29-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంబుధవారం మరిన్ని వరాలు ప్రకటించింది.ఉద్యోగులకు, రైతులకు వరాలు కురిపించే నిర్ణయాలనుచంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వోద్యోగుల కరువు భత్యాన్ని(డిఎను) 30.66 శాతానికి పెంచుతూ మంత్రి వర్గంనిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రభుత్వఖజానాపై 63 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. రైతులకు నిరుడు ప్రకటించిన రాయితీల ప్యాకేజీనిఅమలును కొనసాగించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఈ ప్యాకేజీఅమలులో ఉంటుంది. అపరాధ వడ్డీ మాఫీ, 3 శాతం వడ్డీ రాయితీ,మొదలైనవి ఈ ప్యాకేజీలో ఉన్నాయి. వచ్చే నెల 10వ తేదీనుంచి వారం రోజుల పాటు చదువుల పండుగనిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X