ఎన్నికలకు బిజెపి కార్యాచారణ సిద్ధం

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 29-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: వచ్చే శాసనసభ ఎన్నికలకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(బిజెపి) కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.బుధవారం ఇక్కడ జరిగిన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలసమావేశంలో ఈ ప్రణాళికను ఖరారు చేశారు.

వచ్చే నెల 15వ తేదీనుంచి నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులునిర్వహించనున్నట్లు సమావేశానంతరంకేంద్ర మంత్రి, బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయప్రకటించారు. అనంతరం మూడు ప్రాంతీయసదస్సులు నిర్వహిస్తామని, రాయలసీమ, తెలంగాణ, కోస్తా ప్రాంతీయసదస్సులు పెద్ద యెత్తున జరుగుతాయని ఆయనచెప్పారు. వాజ్‌పేయి ప్రభుత్వం సాధించిన విజయాలను, రైతులకు ఇచ్చిన రాయితీల గురించి ప్రజల్లోకితీసికెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టామనిఆయన చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి