కంగారుల ధాటికి కుప్పకూలిన కివీస్‌

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 29-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

ఫరీదాబాద్‌: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కంగారూల ధాటికి కివీస్‌ కుప్పకూలిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌పై సునాయసవిజయం సాధించింది. భారత్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌ జరుగుతోంది. బుధవారం న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ జరిగింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో 33 ఓవర్లుమిగిలి ఉండగానే ఆస్ట్రేలియా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయివిజయ లక్ష్యాన్ని ఛేదించింది. తన 32వ జన్మ దినం జరుపుకున్న మాథ్యూ హెడెన్‌ ఈ మ్యాచ్‌లోఅర్థ సెంచరీ పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. ఇది వన్డేల్లో అతనికి 18వఅర్థ సెంచరీ. అంతకు ముందు ఆస్ట్రేలియా మరో ఓపెనర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ 18 బంతుల్లో 29 పరుగులు చేసి జాకబ్‌ ఓరమ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. లంచ్‌విరామం తర్వాత హెడెన్‌తో కలిసి రికీ పోంటింగ్‌ ఆస్ట్రేలియానువిజయం అంచులకు తీసికెళ్లాడు. పోంటింగ్‌ టఫీ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ను నాథన్‌ బ్రేకన్‌ తుత్తునియలు చేశాడు. ప్రధానమైన న్యూజిలాండ్‌వికెట్లను అతను తీసుకున్నాడు. క్రిస్‌ నెవిన్‌,స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, జాకబ్‌ ఓరమ్‌ వికెట్లను బ్రేకన్‌ పడగొట్టాడు. బ్రాడ్‌విలియమ్‌ 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి