Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!
హైదరాబాద్: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు ప్రకటించిన రాయితీలపైవిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. ఓటర్లను మోసగించిగెలుపొందడానికి చంద్రబాబు వరాలుప్రకటిస్తున్నాయని ప్రతిపక్షాలు అభిప్రాయపడ్డాయి. ఆచరణ సాధ్యం కాని హామీలను, రాయితీలనుచంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారనికాంగ్రెస్ విమర్శించింది. ఇప్పటి వరకు చార్జీలు,సర్‌చార్జీలతో ప్రజలపై భారం మోపినతెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని వరాలు కురిపిస్తోందని ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌విమర్శించారు. ప్రేమఉంటే స్థానిక సంస్థలకుఅధికారాలు, నిధులు బదలాయించాలని ఆయనచంద్రబాబును డిమాండ్ చేశారు. శాస్త్రీయంగాఅధ్యయనం చేయకుండా రైతులకు ప్రభుత్వం కరెంట్ రాయితీలుప్రకటించిందని, ఇవి ఆచరణ సాధ్యం కావని పిసిసిఅధికార ప్రతినిధి కె. రోశయ్య అన్నారు. రైతులనుమరోసారి వంచించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. కరువు సహాయక చర్యల్లో విఫలమైన ప్రభుత్వం ఓట్ల కోసం వంచనాశిల్పంప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. | ||