భారత్‌ ప్రతిపాదనలకు పాక్‌ సానుకూలం

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 29-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇస్లామాబాద్‌: భారత్‌ ప్రతిపాదనలకు పాకిస్థాన్‌ సానుకూలంగా ప్రతిస్పందించింది. ఉభయ దేశాల మధ్యవిమాన సర్వీసుల ప్రారంభానికి వచ్చే నెల 1, 2 తేదీల్లో సాంకేతిక స్థాయి చర్చలు జరపడానికి పాకిస్థాన్‌అంగీకరించింది. రైలు సర్వీసుల ప్రారంభానికి ఇది వర్తించదని ప్రకటించింది.

భారత ప్రతిపాదనలను తాము జాగ్రత్తగా పరిశీలించి సానుకూలంగా ప్రతిస్పందించామని, భారత్‌ కూడా తమ ప్రతిపాదనలకు సానుకూలంగా ప్రతిస్పందించగలదని ఆశిస్తున్నామని పాకిస్థాన్‌ విదేశీ వ్యవహారాల కార్యదర్శి రియాజ్‌ ఖోఖర్‌ అన్నారు. ముందువిమాన సర్వీసుల ప్రారంభానికి చర్చలు జరిగిన తర్వాతరైళ్ల ప్రారంభానికి చర్చలు జరగాలని, ఈ రెండింటికి ఏ విధమైన సంబంధం ఉండకూడదని ఆయన అన్నారు.

శ్రీనగర్‌, ముజఫర్‌బాద్‌ల మధ్య బస్సుసర్వీసు ప్రారంభించాలనే ప్రతిపాదనను తాముఅంగీకరిస్తున్నామని, అయితే చెక్‌ పాయింట్స్‌ పర్యవేక్షణను ఐక్యరాజ్య సమితి అధికారులు చేపట్టాలని,వివాదస్పద ప్రాంతమైనందున ప్రజలు ఈ రెండు ప్రదేశాల మధ్య ఐక్యరాజ్యసమితి పత్రాలతో మాత్రమే ప్రయాణించాలని అయన అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి