ఉస్మానియాలో దాడి- 14 మంది అరెస్టు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 29-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోనిఉస్మానియా విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థులపై దాడిచేశారనే ఆరోపణపై పోలీసులు బుధవారం 14మంది విద్యార్థులను అరెస్టు చేశారు. అరెస్టయినవిద్యార్థులు అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి)కిచెందినవారు.

ఇద్దరు దళిత విద్యార్థులపై గోదావరి ఎహాస్టల్‌లో కొంత మంది దాడి చేశారు. ఈదాడిలో ఆ విద్యార్థులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వీరిద్దరు తెలంగాణ రాష్ట్ర సమితిమద్దతుదారులు. దళిత విద్యార్థులపై దాడికినిరసనగా బుధవారం విద్యార్థులు తరగతులనుబహిష్కరించారు. దాడికి పాల్పడిన విద్యార్థులనుయూనివర్శిటీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్‌చేశారు. బోర్డర్స్‌, నాన్‌ బోర్డర్స్‌ మధ్య వివాదం ఈదాడికి కారణమై ఉంటాయని పోలీసులు అంటున్నారు. అయితేరాజకీయ అనుబంధత కూడా కారణమై ఉండవచ్చుననివారంటున్నారు. దళిత విద్యార్థులపై జరిగిన దాడితో తమకు ఏ విధమైన సంబంధం లేదని ఎబివిపి స్పష్టం చేసింది. తాము ఎస్‌సి, ఎస్‌టిలకు వ్యతిరేకంకాదని చెప్పింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X