Home

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 30-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

మార్కుల స్కాంపై ఉన్నతస్థాయి విచారణ
హైదరాబాద్‌: విద్యార్థి లోకాన్ని నివ్వెరపరిచిన మార్కుల కుంభకోణంపై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. మార్కుల రీవాల్యుయేషన్‌ లో అవకతవకలు జరిగిన విషయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఇంటర్‌ బోర్డులోని కొంతమంది అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎన్‌.ఎం.డి ఫరూఖ్‌ గురువారం అన్నారు.

ఈ ఉదంతంపై సమగ్రంగా విచారణకు ఒక ఉన్నతాస్థాయి కమిటీని వేసినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుంచి రీవాల్యుయేషన్‌ ను ఎత్తివేయాలనే ఆలోచన కూడా ఉందన్నారు. అయితే, రాజకీయ నాయకుల ప్రమేయం మాత్రం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, తారుమారైన విద్యార్థుల మార్కుల జాబితాను ఎందుకు ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఎం.వి.మైసూరారెడ్డి ప్రశ్నించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి