పాకిస్థాన్ ఒక బచ్చా: ఫెర్నాండెజ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ లాంటి చిన్న దేశాన్ని చూసి భారత్ బెంబేలుపడిపోదని రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌పేర్కొన్నారు. అదొక బచ్చా (పిల్లాడు) లాంటిదని ఆయన అభివర్ణించారు. గత ఆర్నెళ్ళల్లో పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్రవాదంలో ఏలాంటి మార్పులేకున్నా, పాక్ ను చూసి భారత్ భయపడాల్సిందేమీ లేదని ఫెర్నాండెజ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పాకిస్థాన్ ఎనాటికీసైనికంగా భారత్ కు సవాల్ విసిరేంత స్థితికి చేరదని ఆయన అన్నారు.
పాక్ ప్రేరిపత ఉగ్రవాదంలో మాత్రం ఎటువంటి మార్పులేదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.ఈరోజు ఒక స్థాయిలో వారు ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తున్నందున, రేపు మున్మందు భారీ స్థాయిలో విరుచుకపడుతారని భావించడానికివీల్లేదని ఆయన అన్నారు. సైనికంగా, పాక్ చేష్టలను పిల్లచేష్టలుగా ఆయన అభివర్ణించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!