తిరుపతి:రోడ్డు ప్రమాదం, 6గురి మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 30-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

తిరుపతి: తిరుపతికిసమీపంలో గురువారం ఉదయం జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. ఒకరు గాయపడ్డారు. మరణించినవారిలోరెండేళ్ళ చిన్నారి కూడా ఉంది.

తమిళనాడులోని సేలం నుంచివీరు తిరుమలకు వస్తుండగా తిరుపతికి సమీపంలోనిమంగలపట్టు వద్ద ఉదయం ఏడు గంటలకు ఈదుర్ఘటన జరిగింది.వీరు ప్రయాణిస్తోన్న టాటా సుమోను బెంగుళూరుకు వెళుతోన్న ఓ లారీ వేగంగా వస్తూ ఢీకొంది. సుమోలో ఉన్న కుటుంబసభ్యులు ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. రెండేళ్ళ చిన్నారి మాత్రం రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు.

అనంతపురంలో ఇద్దరి మృతి
అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ కు చెందిన ఇద్దరు మృతి చెందారు. బెంగుళూరు నుంచి వస్తోన్నమినీ బస్సును లారీ ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తోన్న లక్ష్మి అనే మహిళతో పాటు మరో వ్యక్తి మరణించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X