Home

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 30-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

నా ప్రమేయం లేదు: మంత్రి తలసాని

హైదరాబాద్‌: మార్కుల కుంభకోణంలో తన ప్రమేయం ఉందని వస్తోన్న వార్తలను పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ కొట్టిపారేశారు. తన కుమారుడు వైజాగ్‌ లో చదువుకుంటున్నాడని, బిట్స్‌ పిలానీలో చదువుకోవడం లేదని స్పష్టం చేశారు. మా వాడికి రీవాల్యుయేషన్‌ లో ఒక మార్క్‌ మాత్రమే ఎక్కువ వచ్చింది. సో..బిట్స్‌ పిలానీలోసీటు రాలేదు. వాడిప్పుడు వైజాగ్‌ లో చదవుకుంటున్నాడు. ఇందులో మా ప్రమేయం ఏమీ లేదని ఆయనవివరించారు.

మీడియాలో వస్తోన్న వార్తలను ఆయన తప్పుబట్టారు. రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను లాగడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా వాడు టీనేజ్‌ కుర్రాడు. తనపై వస్తోన్న అసత్య ప్రచారాన్ని చూసి వాడు ఏమైనా చేసుకుంటే, ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన మీడియాపైమండిపడ్డారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి