అలిపరి ఘటనః రెండు ఇళ్ళు సీజ్‌

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 31-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌ః తిరుమలోరోడ్డులోని అలిపిరి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై నక్సలైట్లు చేసిన హత్యాయత్నం కేసుదర్యాప్తులో శుక్రవారం పురోగతి కన్పించింది. ఇక్కడ క్లెమోర్‌మైన్స్‌ ను పేల్చిన నక్సలైట్లు బస చేసినట్టుఅనుమానిస్తున్న రెండు ఇళ్లను సీనియర్‌ ఐపిఎస్‌అధికారి డిటి నాయక్‌ నాయకత్వంలోని స్పెషల్‌ఇన్వెస్టిగేషన్‌ టీం (సిట్‌) సీజ్‌ చేసింది.

ముఖ్యమంత్రిపై దాడి జరిగినముప్పైరోజుల అనంతరం కేసు దర్యాప్తు వేగంపుంజుకొంటున్నది. ఈ రెండు ఇళ్ళల్లో ఉంటున్నవారిని సిట్‌అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఈ వివరాలను పోలీసులు గోప్యంగాఉంచారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి