వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందస్తు ఎన్నికలకు పోతాం: అద్వానీ తిరుపతి: ప్రధాని వాజ్‌పేయి ఇస్లామాబాద్‌ నుంచి తిరిగి రాగానే ముందస్తు లోక్‌సభ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ చెప్పారు. ఆయన శుక్రవారం సతీసమేతంగా తిరుమలను సందర్శించారు. ముందు పద్మావతి అమ్మవారిని సందర్శించుకుని తిరుమల చేరుకున్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

సిడ్నీ: మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ రాణించడంతో,సెహ్వాగ్‌ దూకుడుతో భారత్‌ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌తో గౌరవ ప్రదమైన స్కోరు సాధించే దిశగా సాగుతోంది. ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడువికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సచిన్‌ టెండూల్కర్‌ 73 పరుగులతోను,వివియస్‌ లక్ష్మణ్‌ 29 పరుగులతోనూ క్రీజ్‌లో ఉన్నారు.

టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆకాశ్‌ చోప్రా,వీరేంద్ర సెహ్వాగ్‌ బ్యాటింగ్‌కు దిగారు. చోప్రా ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బ్రెట్‌లీ బౌలింగ్‌లో జిలెస్పీకి క్యాచ్‌ ఇచ్చాడు. అయితేఅంపైర్‌ నోబాల్‌గా ప్రకటించడంతో చోప్రా అవుట్‌ ఇవ్వలేదు. ఆ తర్వాతి బంతిని సిమన్‌ కటీచ్‌ జారవిడిచాడు. బ్రెట్‌లీ బౌలింగ్‌నుసెహ్వాగ్‌ చీల్చి చెండాడు. ఒక ఓవర్‌లో 18 పరుగులు చేసి కంగారులకు దడ పుట్టించాడు. లంచ్‌ సమయానికి భారత్‌వికెట్‌ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. ఈ సమయానికి చోప్రా 35 పరుగులు చేయగాసెహ్వాగ్‌ తన అర్థ సెంచరీ పూర్తి చేశాడు.

లంచ్‌ విరామ సమయం తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు నాథన్‌ బ్రేకన్‌, జిలెస్పీ భారత ఓపెనర్లను కట్టడి చేశారు. 12 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే చేయగలిగారు.సెహ్వాగ్‌ జిలెస్పీ బౌలింగ్‌లో 73 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద గిల్‌క్రిస్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ద్రావిడ్‌ చోప్రాతో కలిసి ఆచితూచి ఆడాడు. మొదటిసెషన్‌లో బాగా ఆడిన చోప్రా రెండో సెషన్‌లో తడబడ్డాడు. చోప్రా 45 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బ్రెట్‌లీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత ద్రావిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌ కలిసి నెమ్మదిగా ఆడారు. రెండోసెషన్‌లో భారత్‌ తన స్కోర్‌కు 53 పరుగులు జోడించింది.టీ విరామా సమయం తర్వాత ద్రావిడ్‌, టెండూల్కర్‌ కలిసి భారత స్కోరును ముందుకు నడిపిస్తూ ఆడుతున్న సమయంలో జిలెస్పీ ద్రావిడ్‌ను ఎల్‌బిడబ్ల్యు చేశాడు. ద్రావిడ్‌ 38 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అవుటయ్యాడు.

ఆ తర్వాత గంగూలీ తాను స్వయంగా బ్యాటింగ్‌కు రాకుండా లక్ష్మణ్‌ను పంపాడు. సచిన్‌ టెండూల్కర్‌ ఈసెషన్‌లో కొన్ని మంచి షాట్లు కొట్టి ప్రేక్షకులను అలరించాడు. ఈ సిరీస్‌లో ఏ మాత్రం రాణించని సచిన్‌ టెండూల్కర్‌ ఈ ఇన్నింగ్స్‌లో తన సత్తా తగ్గలేదని నిరూపించాడు. లక్ష్మణ్‌తో కలిసి సచిన్‌ 66 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ సిరీస్‌లో సచిన్‌ తన తొలిఅర్థ సెంచరీని సాధించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X