వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముందస్తు ఎన్నికలకు పోతాం: అద్వానీ తిరుపతి: ప్రధాని వాజ్‌పేయి ఇస్లామాబాద్ నుంచి తిరిగి రాగానే ముందస్తు లోక్‌సభ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ చెప్పారు. ఆయన శుక్రవారం సతీసమేతంగా తిరుమలను సందర్శించారు. ముందు పద్మావతి అమ్మవారిని సందర్శించుకుని తిరుమల చేరుకున్నారు.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి), తెలుగుదేశం వేర్వేరు ఎన్నికల ప్రణాళికలతో పోటీ చేస్తాయని బిజెపి జాతీయాధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మిత్రపక్షమైన తెలుగుదేశం విధానాలను అన్నింటినీ తాముఅంగీకరించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి పూర్తి మెజారిటీ లభించినా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో తమ పార్టీకి ఉన్న అనుభవం మరే పార్టీకీ లేదని ఆయన అన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే వారే ఇబ్బందుల పాలవుతారని అనుభవంలోకి వచ్చిందని ఆయన అన్నారు. అభివృద్ధి ఎజెండాతోనే తాము ఎన్నికల పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!