• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓటమి భయంతో కాంగ్రెస్‌ పొత్తులుః బాబు

By Staff
|

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) మాజీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి బుధవారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిని ఆయన సోనియాకువివరించారు.

రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వఅపసవ్య విధానాలను, తెలుగుదేశం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తీరును సోనియాకువివరించినట్లు రాజశేఖర్‌ రెడ్డి విలేకరులకు చెప్పారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము అనుకూలమేనని, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చిన్న రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతుందని ఆయన అన్నారు. రెండవ రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ను వేయాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పట్ల ప్రజలవిశ్వసనీయత పెరుగుతోందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిచే వాతావరణం ఉన్నదని తాను సోనియాకు చెప్పినట్లు రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X