వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా విదేశీయతపై బాబు ధ్వజం అనంతపురం: కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి లేదని, అవగాహన లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడువిమర్శించారు. తెలుగుదేశం అనంతపురం జిల్లా ప్రజా సదస్సులో ఆయన బుధవారం ప్రసంగించారు. పనికి ఆహారం పథకానికి అడ్డుపడ్డారని, జన్మభూమికి అడ్డుపడే ప్రయత్నం చేశారని, తాను చేసే ప్రతి మంచిపనికి అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తమ సమ్మెకు జూనియర్‌ డాక్టర్లు ప్రతిపక్షాల ప్రత్యక్ష మద్దతునుకోరారు. జూనియర్‌ డాక్టర్ల సమ్మె గత 36 రోజులుగా సాగుతోంది. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జూనియర్‌ డాక్టర్ల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు చెప్పారు. తన మొండివైఖరి విడనాడకపోతే సంభవించే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుందని వారు హెచ్చరించారు.

విపక్షాల మద్దతు కోరుతూ జూనియర్‌ డాక్టర్లు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి, మజ్లీస్‌ నాయకులు పాల్గొన్నారు. జూనియర్‌ డాక్టర్ల సమ్మె విషయంలో ప్రభుత్వం పట్టువిడుపుల ధోరణి ప్రదర్శించాలని విపక్షాల నాయకులు కోరారు. యూజర్‌ చార్జీల ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి 20 కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయని, అయితే ప్రపంచ బ్యాంక్‌ షరతు మేరకు ఈ చిన్న మొత్తం కోసం యూజర్‌ చార్జీలను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వారన్నారు.

ఇదిలావుంటే, జూనియర్‌ డాక్టర్ల ఆమరణ నిరాహారదీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాల వద్ద దీక్ష చేస్తున్న ఇద్దరు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వారిని పోలీసులు అరెస్టు చేసి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం వారు కోఠీ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొందరు ఆందోళనకారులు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటిండెంట్‌ కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించే ప్రయత్నం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X