• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్‌

By Staff
|

హైదరాబాద్‌: స్టాంపుపేపర్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన అబ్దుల్‌ కరీం తెల్గీ ముఖ్య అనుచరుడు అబ్దుల్‌ వాహిద్‌ను బెంగుళూర్‌ పోలీసులు హైదరాబాద్‌ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పోలీసులకుఅప్పగించారు. స్టాంపు పేపర్ల కుంభకోణంలో వాహిద్‌పై హైదరాబాద్‌లోని ఒక పోలీసుస్టేషన్‌లో 1999లో కేసు నమోదైంది. వాహిద్‌ను బెంగుళూర్‌ పోలీసులు 2002లోఅరెస్టు చేశారు.

హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ శాసనసభ్యుడుసి. కృష్ణా యాదవ్‌ మనుషులు వాహిద్‌ను, తెల్గీ మరో అనుచరుడు సదాశివను కిడ్నాప్‌ చేశారనే ఆరోపణలున్నాయి. బెంగుళూర్‌కు చెందిన వాహిద్‌ హైదరాబాద్‌లో ఆఫీసుపెట్టి స్టాంపు పేపర్ల వ్యాపారం చేశాడు. వాహిద్‌కు కోర్టు పది రోజుల పాటు పోలీసు కస్టడీకి రిమాండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్టాంపుపేపర్ల కుంభకోణం కేసులో వాహిద్‌ నుంచి హైదరాబాద్‌ పోలీసులు కీలకమైన సమాచారం రాబట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X