వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: తెలంగాణ రాష్ట్ర పార్టీ (టిఆర్‌పి) వ్యవస్థాపక అధ్యక్షుడు గాదె ఇన్నయ్యను బుధవారం వరంగల్‌ పోలీసులుఅరెస్టు చేశారు. భూముల అక్రమ ఆక్రమణ చేస్తూ వ్యక్తులను బెదిరిస్తున్నారనే ఆరోపణపై ఈఅరెస్టు జరిగింది.

గాదె ఇన్నయ్య తన అనుచరులతో భూముల అక్రమ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, అడ్డు చెప్పేవారిని బెదిరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బుధవారం ఒక స్థలంలో తన అనుచరులతో తెలంగాణ స్థూపం నిర్మింంచడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలోఇన్నయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ స్థలమని చెప్పినందున ఆ స్థలంలో తెలంగాణ స్థూపం నిర్మించేందుకు మాత్రమేతాము ప్రయత్నిస్తున్నామని గాదె ఇన్నయ్య అంటున్నారు.

కె. చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)లో ఆయన కొంత కాలం కీలక పాత్ర పోషించారు. అనంతరం చంద్రశేఖర్‌ రావుతో విభేదించి టిఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చి టిఆర్‌పిని ఏర్పాటు చేశారు. తన భూమిని అక్రమంగా అక్రమించుకుంటున్నారని ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇన్నయ్యనుఅరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X