• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అసమ్మతి సమసినట్లే: వైయస్సార్‌హైదరాబాద్‌: కాంగ్రెస్‌ కడప జిల్లా నేతల అసమ్మతి సమసిపోయినట్లేనని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) మాజీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. సమస్య కొంత ఉంటూ మీడియా కొండంత చేసిందని ఆయన సోమవారంవిలేకరులతో అన్నారు. అసమ్మతి నేత డాక్టర్‌ఎం.వి. మైసురారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. వారిద్దరు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ను కలుసుకుంటారు. అధిష్ఠానం వద్ద తమ సమస్యలనువినిపించుకోవడం తప్పేమీ కాదని రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. తాను సమస్యఅసలే లేదని అనడం లేదని, అయితే కొద్దిగా ఉన్న సమస్యను మీడియా ఎక్కువ చేసి చూపిందని ఆయన అన్నారు. కడప లోక్‌సభసీటును మైసురారెడ్డి ఆశిస్తున్నట్లు తనకు తెలియదని ఆయన అన్నారు.

By Staff
|

హైదరాబాద్‌ః సిపిఎంను దిక్కుమాలిన పార్టీగా టిఆర్‌ ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అభివర్ణించారు. టిఆర్‌ ఎస్‌ తో పొత్తు పెట్టుకోడానికి సిపిఐ సిద్ధంగా ఉన్నా సిపిఎం నాయకులు అడ్డుపడుతున్నారని ఆయన సోమవారం ఇక్కడ విమర్శించారు.

తెలంగాణసెంటిమెంటును సిపిఎం అగౌరపరుస్తోందని ఆయన అన్నారు. సిపిఎంకు కష్టపడి పనిచేసే కేడర్‌ తెలంగాణలో ఉండగా పెత్తనం చేసే నాయకులు ఆంధ్రలో ఉన్నారని చంద్రశేఖరరావు తెలిపారు.ఒకే సామాజిక వర్గానికి చెందిన వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు, బివి రాఘవులు తెలంగాణవిషయంలో ఒకే విధంగా ఆలోచిస్తున్నారని ఆయనవిమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X