• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహిళల హత్యకేసులో నలుగురు అరెస్టు

By Staff
|

విశాఖపట్నం/శ్రీకాకుళం: కాంగ్రెస్‌కు ఓటేస్తే దేశాన్ని ఇటలీకి తాకట్టు పెట్టడమేనని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారంశ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన జెండా పండగ బహిరంగ సభలో ప్రసంగించారు.విశాఖపట్నం విమానాశ్రయంలో కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్‌ అభవృద్ధి పనులు చేయదు, చేయనివ్వదని ఆయనవిమర్శించారు. కాంగ్రెస్‌పై ఆయన తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ కాంగ్రెస్‌ అధికారం కోసం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ నిస్పృహతో కొట్టుమిట్టాడుతోందని, దీంతో పొత్తుల కోసం ఇంటింటికీ తిరుగుతోందని ఆయన అన్నారు.

నక్సల్స్‌ సలహా మేరకే కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) రాష్ట్రంలో ఎన్నికల పొత్తుకు సిద్ధపడుతున్నాయని ఆయనవిమర్శించారు. ఈ రెండు పార్టీలు అవకాశవాద పొత్తులకు దిగుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ను ఇష్టం వచ్చినట్లు టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడుకె. చంద్రశేఖర్‌ రావు దుర్భాషలాడారని, ఇప్పుడు అదే పార్టీతో పొత్తుకు సిద్ధపడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ వేర్పాటువాద శక్తులతో చేతులు కలుపుతోందని ఆయన అన్నారు.సమైక్యాంధ్ర కోసం పని చేసిన వామపక్షాలు కూడా వేర్పాటువాద శక్తులతో చేతులు కలుపుతుండడాన్ని ఆయన తప్పు పట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X