వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయిబాబాతో వాజ్‌పేయి మరో భేటీ పుట్టపర్తి: ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి మరోసారి గురువారంనాడు పుట్టపర్తి సత్య సాయిబాబాను కలుసుకున్నారు. రెండు రోజుల పుట్టపర్తి పర్యటనకు వచ్చిన ప్రధాని బుధవారంనాడు ఒకసారి సత్యసాయిబాబాతో సమావేశమయ్యారు. గురువారంనాడు గంటసేపు సత్యసాయిబాబాతో వాజ్‌పేయి ఏకాంతంగాచర్చించారు. బుధవారం వాజ్‌పేయి సత్యసాయిబాబాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గురువారం కూడా వాజ్‌పేయితో మాట్లాడారు. తమ సమావేశంలో పొత్తుల ప్రస్తావన రాలేదని ఆయన చెప్పారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన ప్రధానితో మాట్లాడారు. చర్చలవివరాలను ఆయన వెల్లడించలేదు.పుట్టపర్తిని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని చంద్రబాబు చెప్పారు.అందుకు పుట్టపర్తికి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) వ్యవస్థ వంటిది అవసరమని ఆయన అన్నారు. పుట్టపర్తిలో రాజకీయాలు మాట్లాడకూడదని నిర్ణయించుకున్న చంద్రబాబు మీడియా ప్రతినిధులతో పుట్టపర్తి ట్రస్టు చేపట్టినసేవలను కొనియాడారు.

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఈ నెల 22వ తేదీన జరిగే పార్టీవిజయభేరి సభ ఏర్పాట్ల పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు.విజయభేరి ఏర్పాట్లను ఆయన గురువారం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో సమీక్షించారు.

హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానం నుంచి సికింద్రాబాద్‌ వరకు జరిగే ర్యాలీ ఏర్పాట్లు,విజయభేరి బహిరంగ సభ వేదిక అలంకరణ గురించి సమావేశంలో చర్చించారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని నలు మూలల నుంచి వచ్చే వారికి విడిది ఏర్పాట్లపై, వారికి వసతి సదుపాయ కల్పనపై సమావేశంలో కూలంకషంగా
చర్చించారు. నగరాన్ని, నగర పరిసరాలను విజయభేరి కోసం అలంకరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ సమావేశానంతరంవిలేకరులతో చెప్పారు. ఈ సమావేశంలో 14 మంది సమన్వయ కమిటీ సభ్యులతో పాటు మంత్రులు,సీనియర్‌ పార్టీ నేతలు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X