వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దగ్గుబాటి నోట ప్రత్యేక ఆంధ్ర మాట
వారణాసి: భారతీయ జనతా పార్టీ (బిజెపి నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా ధ్వజమెత్తారు. దేశానికి అన్నిఅరిష్టాలను ఎన్‌డిఎ ప్రభుత్వం కొని తెచ్చిందని ఆమె దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు బహిరంగ సభల్లో ఆమె గురువారం ప్రసంగించారు.
కాంగ్రెస్‌ను గెలిపిస్తే దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఎన్‌డిఎ ప్రభుత్వ విధానాలతో ఏ ఒక్కరు కూడా సంతృప్తిగా లేరని ఆమె అన్నారు. దేశం ఎదుర్కుంటున్న సమస్యలకు ఎన్‌డిఎ ప్రభుత్వమే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే దేశాన్ని రక్షిస్తుందనే నినాదాన్ని ఆమె పదేపదే వల్లించారు. సోనియా గాంధీ రోడ్డు యాత్ర సందర్భంగా ప్రజలు ఇరు వైపులా నిల్చుని అభివాదం చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!