రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
కడప/మహబూబ్నగర్: ఆల్మట్టి ఎత్తుపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వైఖరిపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం కడప, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించారు.
కడప జిల్లాలో ఆయన రాయలసీమ థర్మల్ పవర్ప్లాంట్ (ఆర్టిపిపి)కు శంకుస్థాపన చేశారు. 1500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టువిద్యుదుత్పాదక సామర్థ్యం 420 మెగావాట్లు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 32 నెలల్లో పూర్తవుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమవిద్యుత్తు అవసరాలు తీరుతాయని ఆయన చెప్పారు.
అనంతరం ఆయన మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానదిపై తలపెట్టిన జూరాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన టిఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల తెలంగాణకు నీరుఅందుతుందని అంటూ టిఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం చేయడానికి పూనుకున్నదని ఆయన అన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల తెలంగాణకు నీరందుతుందనే టిఆర్ఎస్ వాదనలో నిజం లేదని ఆయన అన్నారు. కృష్ణా నదీ జలాలపై టిఆర్ఎస్ వైఖరి ఆంధ్రప్రదేశ్కునష్టం చేస్తుందని ఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!