• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేడు లక్ష్మణ్‌ రిసెప్షన్‌ కు క్రికెటర్లు

By Staff
|

హైదరాబాద్‌: కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) మరో మెలిక పెట్టింది. రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ (ఎస్‌ఆర్‌సి) సిఫార్సుకు ఒప్పుకుంటేనే కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు మంగళవారం విలేకరులతో అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యుసి) తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఫజలల్‌ అలీ కమీషన్‌ సిఫార్సు చేసిన తర్వాత మరో కమీషన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదనేది టిఆర్‌ఎస్‌ వైఖరి. రెండో పునర్విభజన కమీషన్‌ ఏర్పాటు వల్ల రాష్ట్రం ఏర్పాటులో జాప్యం జరుగుతుందనేది టిఆర్‌ఎస్‌ ఉద్దేశం.

సీట్ల సంఖ్య విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పిన చంద్రశేఖర్‌ రావు బుధవారం తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు జాబితాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో బహిరంగ సభకు కెసిఆర్‌తో పాటు టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల ఫోరం చైర్మన్‌ ఎ. నరేంద్ర హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్తారు. సమైక్యాంధ్ర నినాదంతో పని చేస్తున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో ఎన్నికల పొత్తు ఉండదని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. చర్చల్లో ప్రతిష్టంభన ఏదీ లేదని టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల చైర్మన్‌ ఎ. నరేంద్ర అన్నారు. తమ ప్యాకేజీని అంగీకరించాలని తాము కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించడం, తాము కోరిన సీట్లు, ఉమ్మడి ప్రచారం అనేవి తమ ప్యాకేజీలోని అంశాలని ఆయన వివరించారు. బుధవారం ఉదయం లోగా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X