వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయభేరికి ఏర్పాట్లు పూర్తి
ముంబాయి: కాంగ్రెస్ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్.బి. చవాన్ గురువారం ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన చాలా కాలంగాఅస్వస్థతతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 83 యేళ్లు.
మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ముంబాయిలోని ఒక ఆస్పత్రిలో ఆయనకు ఈ నెల 20వ తేదీన శస్త్రచికిత్స జరిగింది. గత ఐదు రోజులుగా ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టమ్తోశ్వాస తీసుకుంటున్నారు. తుదకు గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సార్లు పని చేశారు.పి.వి. నరసింహారావు మంత్రివర్గంలో కేంద్ర హోం శాఖను నిర్వహించారు.
Comments
Story first published: Thursday, February 26, 2004, 23:53 [IST]