వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయభేరికి ఏర్పాట్లు పూర్తి
కడప: తెలుగుదేశం ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డివిమర్శించారు. కడప జిల్లా క్వాజీపేటలో కొంత మంది కాంగ్రెస్‌లో చేరే కార్యక్రమానికి ఆయన గురువారంహాజరయ్యారు.
తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు 25పైసలకే రుణాలు ఇస్తామని, రైతులకు ఉచిత విద్యుత్‌అందిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. కడప జిల్లా కమలాపురం సిట్టింగ్ శాసనసభ్యుడుఎం.వి. మైసురారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో సొంత జిల్లాలో పరిస్థితిని చక్కబెట్టే పనిలో రాజశేఖర్ రెడ్డి గత రెండు మూడు రోజులుగా నిమగ్నమయ్యారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!