• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|

కోల్‌కత్తా: భారత క్రికెట్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా కపిల్‌దేవ్‌ పేరు ఖరారైంది. సోమవారం నాడిక్కడ సమావేశమైన భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 7వ తేదీ నుంచి ఆయన శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తారు. పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లే భారత యువ బౌలర్లకు కపిల్‌ శిక్షణ ఇస్తారు. అయితే ఆయన పాకిస్థాన్‌కు భారత క్రికెట్‌ జట్టుతో వెళ్లడం లేదు. ఈ నెల 10వ తేదీ నుంచి భారత క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌ పర్యటన ప్రారంభిస్తుంది.

ఇదిలా వుంటే, పాకిస్థాన్‌తో జరిగే వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లకు బౌలర్లు అనిల్‌ కుంబ్లే, అజిత్‌ అగార్కర్‌ దూరంగా ఉంటున్నారు. గాయాల కారణంగా వారు వన్డే సిరీస్‌కు దూరమవుతున్నారు. ఫిట్నెస్‌ రిపోర్టుల ఆధారంగా వారిని వన్డేలకు దూరంగా వుంచుతున్నట్లు బిసిసిఐ కార్యదర్శి కరుణాకరన్‌ నాయర్‌ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X