• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|

విజయవాడ: పొట్టిశ్రీరాములు సాక్షిగా తెలుగుదేశం, కాంగ్రెస్‌ కార్యకర్తలు సోమవారం ఘర్షణకు దిగాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలువిజయవాడలో ప్రదర్శన నిర్వహించి పొట్టిశ్రీరాములుకు నివాళి అర్పించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)తో పొత్తుపెట్టుకుని కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సిద్ధపడిందని తెలుగుదేశం నాయకుడు, మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావువిమర్శించారు. టిఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు అవకాశవాదమని ఆయనవిమర్శించారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని తెలుగుదేశం అపవిత్రం చేసిందంటూ పాలతో శుద్ధి చేశారు.

తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకుఅంగీకరించలేదని, రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ ఏర్పాటు చేయాలని కోరామని కాంగ్రెస్‌ నాయకుడు మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు నినాదం ఇచ్చిన బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తుపెట్టుకోవడం అవకాశవాదం కాదా అని ఆయన అడిగారు. ఆ తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని పన్నీరుతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణపూరిత వాతావరణం చోటు చేసుకుంది. ఉద్రిక్తత చోటు చేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X