• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌ కుశివశంకర్‌, కేశవరావు రాజీనామా

By Staff
|

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్‌ రావు తమ పార్టీని రాబంధువుగా అభివర్ణించడంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ముందుకు వచ్చినకె. చంద్రశేఖర్‌ రావే రాబంధు అని తెలుగుదేశంసీనియర్‌ నాయకుడు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి మంగళవారంవిలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ అపవిత్ర పొత్తు కుదుర్చుకున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ల పొత్తు అవకాశవాదమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఢిల్లీలో చర్చలు జరిపి వచ్చిన అనంతరం అన్ని నియోజకవర్గాలకు దరఖాస్తులు స్వీకరించి చంద్రశేఖర్‌ రావు తెలంగాణ ప్రజలను అయోమయంలో పడేశారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న కెసిఆర్‌ రాబంధా, తెలుగు ప్రజలను కలిసికట్టుగా ఉంచి అభివృద్ధికి కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాబంధా అని ఆయన అడిగారు. చంద్రశేఖర్‌ రావు హద్దులు దాటి మాట్లాడుతున్నారని, నిలకడలేని ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X