నక్సల్స్దర్బార్లు పెట్టవద్దు: వైయస్
చెన్నై: ప్రముఖ సినీ నటుడు, కళావాచస్పతి కొంగర జగ్గయ్య శుక్రవారం చెన్నైలో కన్ను మూశారు. కొంగర జగ్గయ్య బహు ముఖ ప్రజ్ఞాశాలి. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ నటుడిగా ఆయన అనేక పాత్రలు ధరించి ప్రజల మన్ననలు పొందారు. ఆయనది కంచుకంఠం. జగ్గయ్యకవి, చిత్రకారుడు, పాత్రికేయుడు కూడా. జగ్గయ్య నటించిన తొలి చిత్రం ప్రియురాలు. జగ్గయ్య 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఒంగోలు నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తొలి సినీ నటుడు జగ్గయ్యనే కావడం గమనార్హం.
రవీంద్రనాథ్ ఠాగోర్ గీతాంజలిని ఆయన తెలుగులోకి అనువదించారు. ఆయన ఒక పత్రికకు సంపాదకుడిగా కూడా పని చేశారు. ఆయన గత కొంతకాలంగా సినీ రంగానికి దూరంగా ఉంటున్నారు. ప్రముఖ సినీ గేయ రచయితస్వర్గీయ ఆత్రేయ స్మారకార్థం ఏర్పాటు చేసిన మనస్వినిలోఆయన చురుగ్గా పని చేస్తున్నారు.